పొలంబడి.. కొత్త ఒరవడి

Raise Awareness Among Farmers On Cultivation Study Topics - Sakshi

∙ఈ సారి పొలంబడిలో పాఠశాల విద్యార్థుల మమేకం

విద్యార్థి దశ నుంచే వ్యవసాయంపై అవగాహన పెంచేలా అడుగులు

కడప అగ్రిక్చలర్‌: సేద్యం లాభసాటి కావాలి. సాంకేతిక సలహాలు, సాగు అధ్యయన అంశాలపై రైతులకు అవగాహన పెరగాలి. వ్యవసాయ అధికారులు పొలం వద్దకే వెళ్లి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి శాస్త్రీయ సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించాలనే ఉద్దశంతోతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ పొలంబడి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్‌బీకే) పరిధిలో ఒక పొలంబడిని నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లావ్యాçప్తంగా 387 పొలంబడులను ఎంపిక చేశారు. ఇందులో వరి, పత్తి, అపరాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, చిరుధాన్యాలు పంటలు ఉన్నాయి.  

రైతులకు సాంకేతిక సలహాలు, సాగు ఆధ్యయన అంశాలను వివరించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు డాక్టర్‌ వైఎస్సార్‌ పొలంబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తక్కువ òపెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడిని ఎలా సాధించవచ్చు? ఇందుకు శాస్త్రయ సాగు విధానం ఎలా ఉపయోగపడుతుందో రైతులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఒకటి, రెండు చొప్పున మాత్రమే పొలంబడులను నిర్వహించేవారు. అది కూడా కొన్ని పంటలకు మాత్రమే పరిమితం చేసేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అన్ని పంటలకూ పొలంబడి నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం బేస్‌లైన్‌ సర్వేను నిర్వహిస్తున్నారు. త్వరలో సాగుకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.  

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,93, 000 ఎకరాలు. ఇందులో వరి 32,741 హెక్టార్లలో, వేరుశనగ 7,454 హెక్టార్లలో, పత్తిపంట 17,303 హెక్టార్లలో, కందిపంట 3,685 హెక్టార్లలో, జొన్న 2021 హెక్టార్లలో, సజ్జలు 1,091 హెక్టార్లలో, మిరప 1070 హెక్టార్లలో, పసుపు 3420 హెక్టార్లలో, ఉల్లి 3603 హెక్టార్లలో, మొక్కజొన్న 624 హెక్టార్లలో, మినుములు 1268 హెక్టార్లలో, పొద్దు తిరుగుడు 874 హెక్టార్లలో, పెసర 225 హెక్టార్లలో, అముదం 534 హెక్టార్లలో సాగు చేయనున్నారు. ఇందులో ప్రతి ఆర్‌బీకే పరిధిలో ఒక పొలంబడి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై పంటలసాగు చేపట్టగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

 ∙తక్కువ పెట్టబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధించేలా చూడటం. 
∙ఇందులో ఎంపిక చేసిన గ్రామాల్లో 10 హెక్టార్లను గుర్తించి 20 నుంచి 30 మంది రైతులను భాగస్వాములను చేసి సహజ సి ద్ధవనరులతో సాగు చేయించడం. 
∙భూసార పరీక్ష ఫలితాల అధారంగా ఎరువుల వినియోగంపై చైతన్యం కల్పించడం. 
∙వానపాములు, సేంద్రియ ఎరువుల వాడాకాన్ని పెంచి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిచేలా చూడటం. 
∙ విత్తన శుద్ధితో చీడపీడల నివారణ, అంతర మిశ్రమ పంటల ద్వారా మిత్ర పురుగు వృద్ధి, పక్షి స్థావరాల ఏర్పాటు ఆవశ్యకత గురించి తెలియజేయడం. 
∙రైతులను సాగు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా చేయడం, స్వయం నిర్ణయం తీసుకునేలా.. సాధికారత సాధించేలా సమగ్రశిక్షణ ఇచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేయడమే కార్యక్రమం ఉద్దేశం. 

ప్రతి నెల మంగళవారం నుంచి శుక్రవారంలోపు పొలంబడి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు. ప్రతి గ్రా మంలో 14 వారాలపాటు 30 మంది రైతులతో స్థానికంగా సాగు చేస్తున్న పంటలపై శిక్షణ ఇస్తారు. శత్రు, మిత్ర పురుగుల ఉనికిని గుర్తించి మిత్ర పురుగుల సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. పంటలో చీడపీడల పరిశీలన, వాటి నివారణకు తీసుకోవాల్సిన పద్దతులను వివరిస్తారు. రైతు లతో ముఖాముఖి మాట్లాడి శాస్త్రీయ సాగు విధానంపై పూర్థిస్థాయిలో అవ గాహన కల్పిస్తారు. సాగులో ఎదురయ్యే ఆటుపోట్లును అధిగమించేలా సాంకేతిక సలహాలిస్తారు. సాగు పెట్టుబడి వ్య యం 15 శాతం తగ్గించడం, దిగుబడిలో 15 శాతం అధికంగా అందేలా ప్రణాళికలను రూపొందిస్తారు.  

గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌ సహాయకులు నిర్వహించే పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయ అధికారి, మండలస్థాయిలో పర్యవేక్షిస్తారు. సబ్‌డివిజన్‌ స్థాయిలో ఏడీఏæ, జిల్లాస్థాయిలో జేడీఏ పర్యవేక్షిస్తారు.  

త్వరలో కార్యక్రమం ప్రారంభిస్తాం  
జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌కు 387 పొలంబడి కా ర్యక్రమాలు నిర్వహించనున్నాం. త్వరలో ప్రారంభంకానున్న సీజన్‌కు అను గుణంగా ఆయా పంటల సాగు నుంచే కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ సారి విద్యార్థి దశ నుంచే వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా విద్యార్థులను ఈ కార్యక్రమంలో మమేకం చేయనున్నాం.       
– అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top