
తన పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యుత్ టవర్ ఎక్కిన కోరుపల్లి శ్యామ్
భీమవరం: తన పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ విద్యుత్ టవర్ ఎక్కి శనివారం నిరసన తెలిపాడు. శ్యామ్, సునీత దంపతుల ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం తల్లికి వందనం సొమ్ములు వేయకపోవడంతో అధికారులను ప్రశ్నించాడు. డబ్బులు జూలై 5న బ్యాంక్ ఖాతాలో పడతాయని చెప్పడంతో శనివారం వరకు వేచిచూశాడు.
అయినప్పటికీ సొమ్ములు రాకపోవడంతో శ్యామ్..గరగపర్రులోని హెచ్‌టీ విద్యుత్ టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. పోలీసులు వెళ్లి శ్యామ్‌ను టవర్ దిగాలని కోరారు. శ్యామ్ వినకపోవడంతో అతని భార్యతో నచ్చజెప్పించి కిందకు దిగేలా చేశారు. అతడిని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
