ఆనందయ్య మందుల తయారీ ఇలా

Preparation of Anandaiah medicine like this - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణకు 5 రకాల మందులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.  
1. పి: ఈ మందు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండుసార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్‌ లేనివారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కో సం ఒక్కరోజు రెండుసార్లు వినియోగించాలి. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌ దంగిలే 5 బకెట్లు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోకమిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగిచెక్క పొడి  ఒక బకెట్‌ మిక్సీవేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి 4 గం టలు ఉడికించి మందును తయారు చేస్తున్నారు. 

2. ఎఫ్‌: ఈ మందును పాజిటివ్‌ ఉన్న వారికి ఇస్తున్నారు. భోజనం తర్వాత రెండుసార్లు చొప్పున మూడురోజులు తీసుకోవాలి. పుప్పిం టి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోల వరకు సిద్ధం చేసి అన్నింటిని కలిపి మిక్సీవేసిన తరువాత చూర్ణంగా ఈ మందు తయారు చేస్తున్నారు. 

3. ఎల్‌: ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. పి, ఎఫ్‌ రకాల మందుతోపాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. నేల ఉసిరి, గుంటగలగర ఆకులు ఒక బకెట్, మిరి యాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కిలోలు తీసుకుని దీన్ని తయారు చేస్తున్నారు. 

4. కె: ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోలు తీసుకుని కలిపి తయారు చేస్తున్నారు. 

5. ఐ: ఇది ఆక్సిజన్‌ తగ్గిన వారికి కంటి డ్రాప్స్‌. పల్స్‌ను బట్టి ఒక్కో కంట్లో ఒక్క డ్రాప్‌ వేయాలి. దీన్లో తేనె, ముళ్లవంకాయ గుజ్జు, తోకమిరియాలు,కిలో తేనెతో ఈ డ్రాప్స్‌ను తయారు 
చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top