ప్రణబ్‌ మృతి : సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Pranab Mukherjee Passed Away : CM Jagan Express Condolences - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
 

ముఖర్జీ సేవలు అజరామరం: గవర్నర్‌ బిశ్వ భూషణ్
ప్రణబ్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ సేవలు అజరామరం అని కొనియాడారు. ఐదు దశాబ్ధాల పాటు దేశానికి ఎంతో సేవ అందినారని ప్రశంసించారు. బహుళపార్టీ వ్యవస్ధలో ఏకాభిప్రాయ సాధకునిగా ప్రశంశలు అందుకున్న వ్యక్తి ప్రణబ్‌ అని కొనియాడారు. ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో ప్రణబ్ కీలక భూమికను పోషించారని గుర్తుచేశారు.

ప్రొఫెసర్ గా‌, జర్నలిస్టు గా,రచయత గా,ఆర్థిక వేత్త గా పార్టీలకతీతంగా వారు దేశానికి చేసిన సేవ మహోన్నతం. ఆయన మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ 

దేశం పెద్ద రాజనీతిజ్ఞడ్ని కోల్పోయిందంటూ ‌రాష్ట్రప​తి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని రాష్ట్రపతి కోవింద్‌ కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్‌.. సోమవారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top