తిరుపతి తొక్కిసలాట ఘటనపై పిల్‌ దాఖలు | PIL Filed In AP High Court On Tirupati Stampede Incident | Sakshi
Sakshi News home page

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు

Jan 10 2025 1:23 PM | Updated on Jan 10 2025 1:51 PM

PIL Filed In AP High Court On Tirupati Stampede Incident

అమరావతి, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభాకర్‌ రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. 

భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రొటోకాల్‌ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలక్కిసలాటలో 29 మంది మృతి చెందిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు.

తిరుపతిలో వైకుంఠ ద్వార టోకెన్ల టికెట్‌ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. టీటీడీ నిర్లక్ష్యం.. పోలీసుల వైఫల్యంతోనే ఇంతటి ఘోరం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement