అసలు నువ్వు ఆడదానివే కాదు
మంత్రితో చెప్పి నీ కొడుకు ఉద్యోగం తీయించేస్తా
మహిళపై దుర్భాషలకు దిగిన రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోన్ కాల్ రికార్డ్
రాజమహేంద్రవరం సిటీ: ‘ఏయ్.. ఏంటి దళితుడిని ఇంట్లోకి రానిస్తూ మాదర్‌చోద్ వేషాలు వేస్తున్నావు. నీ కొడుకు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు కదా! మంత్రి కొల్లు రవీంద్రతో చెప్పి ఉద్యోగం తీయించేస్తా’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళను బెదిరించిన ఫోన్ రికార్డింగ్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వారం రోజుల కిందట వ్యాపార లావాదేవీల్లో ఓ వ్యక్తిని అప్పారావు బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మరచిపోకముందే ఓ మహిళను ఫోన్‌లో బెదిరించిన ఆడియో జిల్లాలో మరోసారి వైరల్‌గా మారింది.
జాన్‌ను నరికేస్తా..
నగరంలో ఒంటిరిగా నివసిస్తున్న మహిళ ఇంటికి ఓ దళితుడు వస్తున్నాడనే విషయంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘దళితుడు జాన్‌ను ఇంటికి రాకుండా బయటకు తరిమి వేయ్.. లేనిపక్షంలో ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న నీ కొడుకు ఉద్యోగం తీయించేస్తా.. నీ అంతు చూస్తా’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు.
జాన్ అనే వ్యక్తి మాల మహానాడు పేరిట వ్యవహరిస్తున్నాడని, ఇది సరైనది కాదని అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద కూడా మాల మహానాడు, మాదిగ దండోరా ఉన్నాయని, జాన్ విషయం త్వరలో తేల్చేస్తానంటూ ఆయన ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఫైనల్‌గా నీ బతుకు నువ్వు బతుకు. నేను అడుగు పెట్టానంటే అన్నీ తేల్చి పారేస్తాను..నీ బతుకేంటో రోడ్డున పెడతా.. జాన్‌ను అడ్డగోలుగా నరికి పారేస్తా’ అంటూ ఆమెకు స్ట్రాంగ్ వారి్నంగ్ ఇస్తూ దుర్భాషలాడారు.
మహిళలను దుర్భాషలాడడం సరైన విధానం కాదని ఆమె చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ‘నువ్వు మహిళవే కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిరెడ్డి అప్పారావు ఈవిధంగా దిగజారి మాట్లాడడం సరైనది కాదని కూటమి నాయకులే చర్చించుకుంటున్నారు. అయితే మహిళను తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


