
సాక్షి, అమరావతి: ముడుపులు ముట్టచెబితేనే ముఖ్యనేత, ఆయన కొడుకు అపాయింట్‌మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడే జరిగినట్లు తెలిసింది. మంత్రిగా ఉన్న చినబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లోమీడియా మాజీ ప్రతినిధి, మంత్రి చుట్టూ తిరిగే పీఏను సంప్రదించగా. వారిద్దరూ మరో పీఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల చొప్పున రూ.40 లక్షలు తీసుకుని అపాయిట్‌మెంట్ ఇప్పించారని సమాచారం.
ఆ సమయానికి కరకట్ట క్యాంపునకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకుని అక్కడే పీఏలతో గొడ వకు దిగారని తెలిసింది. విషయం ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన పీఏకు కబురుపెట్టారని, ఈలోపే విషయం మంత్రికి చేరడంతో ఆయన ఆ అధికారికి ఫోన్ చేసి తన పీఏనే పిలుస్తారా? తమాషాగా ఉందా? అంటూ చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. అక్రమ వసూ ళ్లకు చినబాబే అనుమతిచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఆయనకూ వాటాలు న్నాయని ప్రచారం. ముఖ్య నేతను కలవాలన్నా.. డబ్బు ముట్టజెప్పాల్సిందేనని కరకట్ట క్యాంపులో చర్చ జరుగుతోంది.