
కర్నూలు: కర్నూలు వ్యవసాయం మార్కెట్‌లో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. తమక కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఉల్లికి సరైన గిట్టుబాట ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని క్వింటాకు రూ. 200 నుండి రూ. 400 వరకూ మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆందోళనకు దిగారు. తమ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పెట్టిన పెట్టుబడికి మద్దతు ధర లేక అప్పులు పాలు అవుతున్నామని రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర రూ. 2 వేలు కల్పించాలని అంటున్నారు. దాంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు ప్రారంభం కాలేదు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి మద్దతు ధర లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.