Tirumala: గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల | New Year Celebrations On Tirumala, Devotees Chanted Govinda Nama's And Shared Laddu Prasadam | Sakshi
Sakshi News home page

Tirumala: గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల

Jan 1 2025 7:57 AM | Updated on Jan 1 2025 10:03 AM

New Year Celebrations on Tirumala

తిరుమల:  ప్రపంచమంతా పార్టీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా అందుకు భిన్నంగా గోవిందనామస్మరణతో తిరుమలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు శ్రీవారి భక్తులు. సరిగ్గా 12 గంటలకు భక్తులందరూ గోవింద నామాన్ని జపించడంతో తిరుగిరులు మార్మోగాయి. దీంతో శ్రీవారి ఆలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ లడ్డూ ప్రసాదంను పంచుకున్న భక్తులు 

తిరుమలలో నేడు (బుధవారం) తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది.  . మంగళవారం శ్రీవారిని 62,495 మంది భక్తులు దర్శించుకోగా, 19,298 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement