ఓబులవారిపల్లె : మౌలిక వసతులు మరింత మెరుగుపరుచుకోవాలని, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని చిన్నఓరంపాడు కస్తూర్బాగాంధీ ఉన్నత పాఠశాల, ముక్కావారిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సంజీవపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతులు, భోజనశాల, స్టాక్ రూములను పరిశీలించారు. అనంతరం సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ఉన్నత పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎంఈఓ–2 రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.


