తిరుపతి అర్బన్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్)ప్రక్రియను ఈ నెల 12కి పూర్తి చేస్తామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ పవన్‌కుమార్‌శర్మ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జిల్లా సర్ ప్రక్రియను వివరించారు. ఈ నెల 14 వరకు గడువు ఉన్నప్పటికీ 12కే పూర్తి చేసే దిశగా లక్ష్యాలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఏపీఎస్‌పీడీసీఎల్ చైర్మన్ శివశంకర్ లోథేటి, జేసీ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, ఆర్డీవో రామ్మోహన్, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.


