తిరుపతి కల్చరల్: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో అయ్య ప్ప మాలధారణ స్వీకరించారు. ముందుగా శ్రీకపిలేశ్వరస్వామి ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో ఆయన పుణ్యస్నానమాచరించి అనంతరం పురోహిత పండితులచే భక్తిపూర్వకంగా మాలధారణ స్వీకరించారు. అనంతరం సదుం మండలం యర్రాతివారిపల్లెలోని కోటమలై శ్రీఅయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు.
దరఖాస్తుల ఆహ్వనం
తిరుపతి అర్బన్:ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తిరుపతి ఎమ్మార్‌పల్లిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఉంటుందని బీసీ వెల్పేర్ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ లోపు తిరుపతిలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్‌లో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఎంపిక చేసిన వారికి ఈ నెల 22 నుంచి ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. రెండు నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఈ సందర్భంగా స్టై ఫండ్‌తోపాటు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తామని తెలిపారు. డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వివరించారు. ఎంపికై న వారు 10వ తరగతి, డిగ్రీ మార్కుల లిస్ట్‌తోపాటు కులధృవీకరణ పత్రం, ఆధాయ ధృవీకరణ పత్రం, వార్షిక ఆదాయ సర్టిఫికెట్ లక్ష లోపు, ఆధార్ కార్డు జిరార్స్, బ్యాంక్ పాస్ పుస్తకం, రెండు పాస్‌ఫొటోలతో ఎమ్మార్‌పల్లిలోని బీసీ స్టడీ సర్కిల్ 4–127–2, 1వ క్లాస్, శ్రీకృష్ణ నగర్‌కు హాజరుకాలని కోరారు.
నేటి నుంచి ఆరో విడత కౌన్సెలింగ్
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ సాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికాగా ఇప్పటికీ సుమారు 400 సీట్ల వరకు భర్తీకి నోచుకోలేదు. అధికారులు శుక్రవారం నుంచి మరో రెండు రోజుల పాటు 6వ విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టేందుకు గురువారం మెరిట్‌లిస్ట్‌ను విడుదల చేశారు.


