కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు | New Super Specialtity Courses Introduced In Kurnool Medical College | Sakshi
Sakshi News home page

కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు

Aug 19 2020 9:25 PM | Updated on Aug 19 2020 9:40 PM

New Super Specialtity Courses Introduced In Kurnool Medical College - Sakshi

కర్నూలు: కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో కొత్తగా 5 సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభానికి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డిని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అభినందించారు.

కాగా, కోర్సుల అనుమతి లభించడంలో సహకరించినందుకు ఎంపి సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ తదితర విభాగాల్లో స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించిందని ఎంపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement