అబ్బో.. అతి పెద్ద బోర్‌ టెక్‌ ఐటీ కంపెనీ! | Netizens Satires on Janasena MLA Lokam Naga Madhavi | Sakshi
Sakshi News home page

అబ్బో.. అతి పెద్ద బోర్‌ టెక్‌ ఐటీ కంపెనీ!

Jun 17 2026 2:00 PM | Updated on Jun 17 2026 2:13 PM

Netizens Satires on Janasena MLA Lokam Naga Madhavi

చెప్పినట్లుగానే తెచ్చి ప్రారంభించిన లోకం మాధవి

సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యేపై సెటైర్లు

సాక్షి, అమరావతి: ‘నేను ఐటీ కంపెనీ నడుపుతున్నా.. నాకు తెలిసిన చాలా మందికి వివిధ దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నెల్లిమర్లను హైదరాబాద్‌లా ఐటీ హబ్‌ చేస్తాను’.. ఎన్నికల ముందు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన లోకం మాధవి చెప్పిన మాటలివి. ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి చేతిపంపులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

దాన్ని చూసిన జనం సామాజిక మాధ్యమాల్లో అబ్బో చాలా పెద్ద బోర్‌ టెక్‌ ఐటీ కంపెనీ తెచ్చారు ఎమ్మెల్యే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌తో సహా అందరూ ఇలానే ఉన్నారని, వారు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని విమర్శలతో పోస్టులు వైరల్‌ చేస్తున్నారు. 

చ‌ద‌వండి: ప‌వ‌న్‌.. మీరా యువ‌త‌కు ప్ర‌తినిధి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement