సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర

MP Gorantla Madhav And MLA Thopudurthi Prakash Reddy Padayatra - Sakshi

హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు కృష్ణా జలాలు

పేరూరుకు పాదయాత్ర చేపట్టిన ఎంపీ మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి 

పావగడ: పేరూరు డ్యామ్‌కు ప్రభుత్వం ఒక టీఎంసీ నీటిని  కేటాయించడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. కర్ణాటకలోని నాగలమడక నుంచి పేరూరు వరకు చేపట్టిన 28 కి.మీ పాదయాత్రలో ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తితో పాటు భారీ ఎత్తున రైతులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ చలువతోనే ‘పేరూరు’కు నీళ్లు 
ప్రభుత్వ నిర్ణయంతో అనంతపురం జిల్లా సరిహద్దులోని నాగలమడక ఉత్తర పినాకిని నది వద్ద కృష్ణా జలాలకు గురువారం మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. చంద్రబాబు హామీలిచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు.

కృష్ణా జలాలను నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు తరలించడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ కృష్ణా నీటిని నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు చేర్చడానికి టీడీపీ అడ్డుపడిందని, అయినా ప్రకాశ్‌రెడ్డి కృత నిశ్చయంతో నీటిని తరలించారని కొనియాడారు. ఇదిలాఉండగా.. స్థానిక నాయకుల గంగపూజ కార్యక్రమం అనంతరం అధికారులు హంద్రీనీవా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్‌ ద్వారా తురకలాపట్నం మీదుగా నాగలమడక చెక్‌డ్యాం వరకు, అక్కడి నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలిస్తున్నారు. 

చదవండి:
సిగ్గుంటే రాజీనామా చెయ్..‌
రోడ్ల మరమ్మతులకు రూ.2,205 కోట్లు మంజూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top