ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా ప్రచారం | MLA Bolla is angry with TDP leaders | Sakshi
Sakshi News home page

ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా ప్రచారం

Jul 30 2023 4:00 AM | Updated on Jul 30 2023 9:12 AM

MLA Bolla is angry with TDP leaders - Sakshi

  గుంటూరు ఈస్ట్‌: టీడీపీ గూండాల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ శావల్యాపురం మండల కన్వినర్‌ భీమని అంకారావును వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళుతుంటే తనపై దాడి చేసి రెండు గంటల పాటు తన కారును అడ్డగించారని, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో అంకారావు  అడ్డుగా రావడంతో టీడీపీ నేతల చేతుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలు వేసుకున్న రాళ్లే వాళ్లకు తగిలాయన్నారు. టీడీపీ నేత పుల్లారావు, ఆయన భార్య చేసిన దోపిడీ గురించి అందరికీ తెలుసన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తనకు అక్రమ ఆస్తులున్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. జీవీ ఆంజనేయులు ఎన్‌ఎస్‌పీ కాలువ పైన రైతుల వద్ద నుంచి కొన్న భూమిలో గెస్ట్‌హౌస్‌ నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జీవీ ఆంజనేయులు వినుకొండలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement