‘దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగింది’

Minister Taneti Vanitha Response Court Verdict Btech Student Murder - Sakshi

సాక్షి, అమరావతి: రమ్య హత్య కేసులో శశికృష్ణకు ఉరి ఖరారు కావడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. కోర్టు విధించిన ఈ చారిత్రాత్మకమైన తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హత్య జరిగిన పది గంటల వ్యవధిలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజుల్లో ఛార్జ్ షీటు వేశారని తెలిపారు. 8 నెలల వ్యవధిలో తీర్పు వచ్చిందని, రమ్య కేసులో తీర్పుపై దిశ చట్టం ప్రభావం ఎంతైనా ఉందన్నారు.

‘ఆడ పిల్లలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దిశ యాప్ తీసుకువచ్చారు.. దిశ చట్టం పెండింగులో ఉన్నప్పటికీ పోలీసులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారని’ చెప్పారు. దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలని హితవు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top