ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్‌

Minister Perni Nani Counter to Director RGV Tweets - Sakshi

కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారూ..

సాక్షి, అమరావతి: ఆర్జీవీ ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. ‘‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. ఏ హీరోకు ఇంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదని’’ మంత్రి పేరి నాని ట్వీట్‌ చేశారు.

సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్‌, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు.  సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదు. ధియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని’’ ట్వీట్‌ చేశారు. ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రమని చెప్పారు. ఎవరికి వర్మగారూ? అమ్మే వారికా?.నిర్మాతల శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్‌ యాంగిల్‌ను గాలికొదిలేశారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారూ.. అంటూ ట్వీట్‌ చేశారు.

‘‘రూ.100 టికెట్‌ను రూ.వెయ్యి, రూ.2వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు. డిమాండ్‌ అండ్‌ సప్లై అంటారా లేక బ్లాక్‌ మార్కెట్‌ అంటారా?’’  అంటూ ట్వీటర్‌ వేదికగా మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top