బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత.. 60 ఏళ్లు దాటాయి ఎవరొస్తారు చూడటానికి..?

Minister Gudivada Amarnath satires on Nandamuri Balakrishna - Sakshi

సాక్షి, విశాఖపట్నం: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సెటైర్లు వేశారు. బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత అంటూ ఆయనను చూడటానికి ఎవరు వస్తారని అన్నారు. ఒంగోలులో జరిగిన బాలయ్య ఫంక్షన్‌కు అనుకున్నంత జనం రాలేదు అంటున్నారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఎవరొస్తారని వ్యాఖ్యానించారు. 

ఆయన సభకు జనం రాకపోతే మాకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి అనుకుంటేఎలా ఇప్పుడు వీరసింహారెడ్డి అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓలకు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే జీఓలు ఏవైనా సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. 

చదవండి: (చంద్రబాబును సీఎంను చేయాలన్నదే వీళ్లకు ముఖ్యం: అమర్నాథ్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top