సర్వం అమూల్‌ కాదు.. సర్వం హెరిటేజ్‌ పాపం అని రాయాలి: మంత్రి అప్పలరాజు

Minister Appalaraju Fires Eenadu Writing False News On Amul Dairy - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అమూల్‌ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్‌ ఈనాడులో సర్వం అమూల్‌ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్‌ కాదు.. సర్వం హెరిటేజ్‌ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్‌ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్‌ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. 

‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా  చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్‌ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది.

ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని  కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. 

ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top