AP: సైక్లోన్‌ అలర్ట్‌.. ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

AP: సైక్లోన్‌ అలర్ట్‌.. పలు జిల్లాలపై తుపాను ప్రభావం అప్‌డేట్స్‌

Published Wed, Dec 6 2023 7:40 AM

Michaung Cyclone Effect in AP Live Updates - Sakshi

Updates..

కలెక్టర్లతో ముగిసిన సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌..
సీఎం జగన్ కామెంట్స్..

  • ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది
  • తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి
  • అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి
  • బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి
  • బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి
  • రుణ సాయం ఎక్కువైనా ఫర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి
  • ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి
  • పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి
  • దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలు తిరిగి వెళ్తున్న సందర్బంలో కానీ, వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి
  • రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు
  • పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి
  • అన్నిరకాల మానవ వనరులు దీనిపై దృష్టి పెట్టండి
  • ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి
  • రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  • వారు అధైర్యపడాల్సిన పనిలేదు
  • ప్రతి రైతునూ ఆదుకుంటుంది
  • పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ప్రభుత్వం ఉంటుంది. 
  • సబ్సిడీపై విత్తనాల సరఫరాకు రకాలుగా సిద్ధం కావాలి.
  • యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి
  • రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి
  • దీన్నికూడా ప్రాధాన్యతగా తీసుకోండి
  • వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి
  • అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. 
  • చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది
  • ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం
  • విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది
  • వలంటీర్ల దగ్గర నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది
  • వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం

  • తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
  • తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై చర్చ

మిగ్‌జామ్‌ తుపాపులో గ్రామ, వార్డు వలంటీర్ల సేవలు

  • విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచిన వలంటీర్‌ వ్యవ‍స్థ
  • ప్రజలను అప్రమత్తం చేసి.. ప్రాణనష్టం లేకుండా చూసిన వలంటీర్లు
  • పునరావాస కేంద్రాలకు తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను తరలించేందుకు కృషి
  • పునరావాస కేంద్రాల్లోనూ సేవలందించిన వలంటీర్లు.
  • తుపాను, వర్షాలపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన వలంటీర్లు
  • సకాలంలో కళ్లాల్లోని ధాన్యాన్ని ఆర్బీకేలకు తరలింపులోనూ రైతులకు అండగా నిలిచిన వలంటీర్లు. 
  • తుపాను నష్టాన్ని అంచనా వేయడంలోనూ కీలక పాత్ర పోషించిన వలంటీర్లు. 
  • వలంటీర్ల సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు 
     

కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

  • ఈరోజు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌
  • తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష చేయనున్న సీఎం జగన్‌

తమిళనాడులో వరద కష్టాలు..

వరదల్లో చిక్కుకున్న విదేశీయులు..

తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న మిగ్‌జామ్‌

  • ఏపీలో బలహీనపడుతున్న మిగ్‌జామ్‌ తుపాను. 
  • తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌. 
  • ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. 
  • తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు
  • తీరం వెంబడి గంటకు 45 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం. 
  • ఏపీ తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

చెన్నైపై తుపాను తీవ్ర ప్రభావం..

విద్యా సంస్థలకు సెలవు..
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 
తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివే­యాలని..
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ జిల్లా కలెక్టర్లకు ఆదే­శాలు జారీ చేశారు.
బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు.  

తూర్పుగోదావరిలో తుపాను బీభత్సం

  • మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • భారీ ఈదురు గాలులతో రెండు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన మిచౌంగ్
  • తుపాన్ ఇక్కడే తీరం దాటుతుందా అన్న రీతిలో వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు
  • పలుచోట్ల కూలిన హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, విరిగిపడిన చెట్లు
  • పూర్తిగా జలమయమైన రోడ్లు..
  • లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపునీరు
  • కోనసీమ జిల్లాలో మరింత పెరిగిన పంట నష్టం
  • ప్రాథమికంగా పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా
  • కొన్ని చోట్ల తీవ్రంగా దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం


 

విజయవాడలో ఘాట్‌ రోడ్‌ మూసివేత..

  • భారీ వర్షాల నేపథ్యంలో వర్షం కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత 
  • భక్తుల భద్రతా కారణాల దృష్ట్యా ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల రాకపోకలు నిలుపుదల
  • వర్షాలు తగ్గేవరకూ ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని నిర్ణయం 
  • అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గ నగర్ మార్గం ద్వారా రావాలని సూచన

సాక్షి, అమరావతి: మిచాంగ్‌ తుపాను తిరుపతి, నెల్లూరు జిల్లాలను కుదిపేసింది. పలు జిల్లాలను వణికించింది. దీని ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు.. 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలు­లతో పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపో­యాయి. 3 రోజు­లుగా ఎడతెరిపి లేకుండా కురిసిన అతి తీవ్ర వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జల­మ­య­మ­య్యాయి.

ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకుపైగా నీళ్లు ఉండడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఈదురు గాలులకు నెల్లూరు జిల్లాలో కరెంటు స్తంభాలు, పలు చోట్ల గుడిసెలు నేల­కూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచి­పోయింది. రోడ్లపై చెట్లు కూలి­పో­యాయి. అయితే ప్రభుత్వం సహాయక చర్యల్ని వేగంగా చేపట్టడంతో యుద్ధ ప్రాతిపదికన కరెంటును పున­రుద్ధరించగలి­గారు. కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించే పనులు చేపట్టారు. సహాయక పనులకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. 

Advertisement
Advertisement