‘పెళ్లి చేయకపోతే సంబంధాలు చెడగొడతా’ | Man Threatening Phone Call For Woman | Sakshi
Sakshi News home page

‘పెళ్లి చేయకపోతే సంబంధాలు చెడగొడతా’

Oct 12 2026 11:46 AM | Updated on Oct 12 2026 11:57 AM

Man Threatening Phone Call For Woman

ఏలూరు జిల్లా : నాకు మీ కూతురితో పెళ్లి చేయకపోతే ఆమెకు వచ్చే సంబంధాలన్నీ చెడగొడతాను అంటూ ఫోన్‌లో బెదిరిస్తున్న వ్యక్తిపై కైకలూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. వదర్లపాడుకు చెందిన గంథం రమేష్‌ కుమార్తె (26) ఇటీవల విజయవాడలో కంప్యూటర్‌ కోర్సు చేయడానికి వెళ్లింది. 

అక్కడ మొగల్లూరుకు చెందిన పడవల అయ్యప్పతో పరిచయం ఏర్పడింది. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అయ్యప్ప కోరగా ఆమె నిరాకరించింది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తుండటంతో అయ్యప్ప వాటిని చెడగొడుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement