ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం 

Man Dies After Falling Off Train Anantapur District - Sakshi

అనంతపురం సిటీ: ఏ ఊరో.. ఏం పేరో తెలియదు.. పట్టుమని 30 ఏళ్లు కూడా ఉండవు. తనంతట తాను రైలు కిందే పడ్డాడో.. లేక రైలొచ్చి ఢీకొందో ఏమో గానీ శరీర భాగాలన్నీ ఎక్కడికక్కడ వేరయ్యాయి. కాళ్లు, చేతులు, తల మాయం కాగా పట్టాల మధ్యలో మొండెం మాత్రమే పడి ఉంది. మోకాళ్ల నుంచి నడుం భాగం మాత్రమే మిగిలింది. చూడ్డానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ భయంకరమైన దృశ్యం అనంతపురంలోని రాంనగర్‌ ఫ్లై ఓవర్‌ నుంచి ప్రసన్నాయపల్లి వైపు నగరానికి సుమారు కిలోమీటరు దూరంలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి, భయంతో పరుగులు తీశారు.

చదవండి: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..

సమాచారం అందుకున్న జీఆర్పీ సీఐ నాగరాజు, ఎస్‌ఐ విజయ్‌కుమార్, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజశేఖరరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం 8 గంటలోపు ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.  మృతదేహం వద్ద లేత నీలం రంగు చెప్పులు పడి ఉన్నాయి. తల, కాళ్లు, చేతులు మాయమై ఉండడాన్ని బట్టి చూస్తే కుక్కలో, పందులో లాక్కెళ్లి ఉంటాయని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పరిసరాల్లో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని సర్వజనాస్పత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్‌పీ సీఐ నాగరాజు తెలిపారు. కాగా,   మృతుడు ఎవరు, ఏం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో శనివారం రాత్రి ఓ ఫంక్షన్‌ జరిగిందని, మృతుడికి ఆ ఫంక్షన్‌కు సంబంధాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top