మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు

Mala Mahanadu Declares Support For The Three Capitals - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులకు మాల మహానాడు మద్దతు ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మంగరాజు తెలిపారు.

‘‘దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అమరావతి రైతులు ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని’’ మంగరాజు హెచ్చరించారు.
చదవండి: AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top