
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ రూ.4 కోట్ల సాయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించాలని మహీంద్రా కంపెనీ నిర్ణయం తీసుకుంది. విశాఖలో 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్, కర్నూలులో 1000 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టనుంది.
ప.గో.జిల్లాకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించనుంది. చిత్తూరు, తూ.గో.జిల్లాలకు రెండు అంబులెన్స్‌లను మహీంద్రా కంపెనీ అందించింది.