వాహనదారులకు అలర్ట్‌! విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..  | Sakshi
Sakshi News home page

వాహనదారులకు అలర్ట్‌! విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. 

Published Sat, Feb 18 2023 12:43 PM

Maha Shivaratri 2023 Traffic Diversions Vijayawada February 18th - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు, వాహనచోదకుల సౌకర్యార్థం విజయవాడ నగరంలో శనివారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా శుక్రవారం తెలిపారు. నగరంలోని పలు మార్గాల్లో సాగే వాహనాల రాకపోకలను వేరే రూట్లకు మళ్లిస్తున్నట్లు వివరించారు. శుక్ర వారం అర్ధరాతి 12 నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

ఆంక్షల సమయంలో భవానీపురంలోని కుమ్మరిపాలెం నుంచి ఘాట్‌రోడ్డుకు, గద్ద»ొమ్మ సెంటర్‌ నుంచి ఘాట్‌ రోడ్డుకు, బస్టాండ్‌ నుంచి ఘాట్‌రోడ్డుకు బస్సులు, కార్లు, ఆటోలు అనుమతించబోమని స్పష్టంచేశారు. స్క్యూ బ్రిడ్జి నుంచి యనమలకుదురు కట్ట వైపు, పెదపులిపాక నుంచి యనమలకుదురు కట్ట వైపు బస్సులు, భారీ వాహనాలను అనుమతించబోమని సీపీ రాణా పేర్కొన్నారు.  

వాహనాల దారి మళ్లింపు ఇలా.. 
► హైదరాబాద్‌– విశాఖపట్నం మధ్య తిరిగే వాహనాలు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, సీవీఆర్‌ ఫ్లై ఓవర్, పైపుల రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి.  
► విజయవాడ – హైదరాబాద్‌ మధ్య ప్రయాణించే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్, గొల్లపూడి, స్వాతి జంక్షన్, వైజంక్షన్, ఇబ్రహీంపట్నం రింగ్‌ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించాలి.  
► బస్టాండ్‌ నుంచి భవానీపురం, పాలప్రాజెక్ట్‌కు రాకపోకలు సాగించే సిటీ బస్సులు రాజీవ్‌గాంధీ పార్కు, కనకదుర్గ ఫ్లై ఓవర్, శివాలయం వీధి, జోజినగర్‌ చర్చి, సితార సెంటర్, చిట్టినగర్‌ మార్గాన్ని అనుసరించాలి.  
► అవనిగడ్డ నుంచి విజయవాడకు కరకట్ట మీదుగా రాకపోకలు సాగించే ఆరీ్టసీ, సిటీ బస్సులు పెదపులిపాక, తాడిగడప, బందరు రోడ్డు, బెంజిసర్కిల్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్‌ మార్గంలో ప్రయాణించాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement