జగనన్న కాలనీల్లోనే మహిళలకు ఉపాధి 

Local Employment For Women Residing In Jagananna Colonies - Sakshi

రాప్తాడురూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు గార్మెంట్స్‌ పరిశ్రమల ద్వారా స్థానికంగానే ఉపాధి కల్పిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు  తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలకు వెళ్లి కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. వారిని స్వయంగా పిలిపించి ఇక్కడి ప్రదేశాలను చూపించారు.

తాజాగా ఎమ్మెల్యే చొరవతో తిర్పూర్‌కు చెందిన బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ గార్మెంట్స్‌ చైర్మన్‌ ఎస్‌.రామస్వామి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. అనంతపురం మండలం ఆలమూరు సమీపంలోని పీవీకేకే కళాశాల వద్ద హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి తదితరులు బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో ఆలమూరు జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం, రాత్రి రెండు షిఫ్టులూ పరిశ్రమలు నడిపేందుకు అనుకూలంగా ఉంటాయని యజమానులు భావిస్తున్నట్లు చెప్పారు. కారి్మకుల రవాణా కోసం బస్సు సదుపాయం కూడా కలి్పంచేలా చర్యలు తీసుకుంటారన్నారు.

పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే  తమిళనాడు, జైపూర్‌ నుంచి అనేకమంది వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. గార్మెంట్స్‌ పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ మంచి వాతావరణం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

వారివెంట రాప్తాడు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ బెడదూరి గోపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ తాటిచెర్ల నాగేశ్వరెడ్డి, వైస్‌ ఎంపీపీ కృష్ణారెడ్డి, అనంతపురం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ పవన్‌కుమార్, నాయకులు వడ్డే శీనా, ఉప్పరపల్లి సర్పంచ్‌ సావిత్రి శ్రీనివాసులు, కక్కలపల్లి సర్పంచ్‌ గార్లదిన్నె కృష్ణయ్య, నాయకులు ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.  

పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి 
రాప్తాడు: పరిశ్రమల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.

నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో పరిశ్రమల కోసం సేకరించిన భూములను శుక్రవారం బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ గార్మెంట్స్‌ చైర్మన్‌ రామస్వామి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి, రామ్‌ రాజ్‌ కాటన్‌ సంస్థ ప్రతినిధి సుందరమూర్తితో కలిసి వారు పరిశీలించారు. సమీపంలోని జగనన్న లేఅవుట్, టిడ్కో ఇళ్లను పరిశీలించారు. 

(చదవండి: నువ్వా నేనా..అనంత అసెంబ్లీ టెక్కెట్‌ దక్కేదెవరికో..?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top