Live Updates
Visakha: మోదీ సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కుమారస్వామి
- విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామి.
- ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
- పరిశీలన తర్వాత ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో సమీక్ష.
మెయింటినెన్స్ లేదు: వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు
- స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను సందర్శించిన వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు
- ప్రమాదానికి కూటమి ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కారణం..
- గత రెండేళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ లో మెయింటినెన్స్ లేదు.
- కార్మికుల భద్రతను గాలికి వదిలేశారు.
- చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం మీద ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రత మీద పెట్టలేదు.
- 6000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు.
- చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
- ఇవి ప్రభుత్వ హత్యలగానే భావిస్తున్నాము..
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఏ ఒక్క కార్మికుడు ఇబ్బంది పడలేదు..
ఈ ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: కుమారస్వామి
- ఈ ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: కేంద్ర మంత్రి కుమారస్వామి
- ఈ ఘటనలో విలువైన ప్రాణాలు కోల్పోవడం, కార్మికులు గాయపడడం బాధాకరం
- నేను సంబంధిత అధికారులతో మాట్లాడాను
- పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నాను
- ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను అంచనా వేస్తున్నారు
- మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
- గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రభుత్వం అండగా ఉంటుంది: కిషన్ రెడ్డి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
విధి నిర్వహణలో ఉంటూ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం
మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ప్లాంట్ లోపల చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలి
సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలి
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులకు అత్యుత్తమ, అత్యవసర వైద్య సేవలు అందించాలి
బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది
గుడివాడ అమర్నాథ్ దిగ్భ్రాంతి
- విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై గుడివాడ అమర్నాథ్ దిగ్భ్రాంతి
- ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
- చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
- గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి
- కార్మికుల భద్రతా ప్రమాణాలను యాజమాన్యం పట్టించుకోలేదు
- రెండు సంవత్సరాల నుంచి కార్మికుల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు
- ఉన్న కార్మికులను తొలగించేస్తున్నారు
- కార్మికుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది
మోదీ దిగ్భ్రాంతి
- విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
- గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన
మృతుల వివరాలు
ఉద్యోగులు
గొంతిన భాను కుమార్ (టెక్నీషియన్)
జి.వి. అప్పారావు
ఎం. కృష్ణ నాగు
కె. ప్రభాకర్ (జనరల్ ఫోర్‌మ్యాన్)
గోల్డ్ కుమార్ (మేనేజర్, మెకానిక్-2 ఇన్‌చార్జ్)
కాంట్రాక్ట్ కార్మికులు
రమణ
త్రినాథ్
ఎన్. అప్పల రాజు
బాడీలను తరలించకుండా అడ్డుకున్న ఉద్యోగులు
గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన శరీరాలు
కాలిపోయిన బాడీలను కేజీహెచ్ మార్చురీకి తరలించడానికి సిద్ధమైన అధికారులు
బాడీలను తరలించకుండా అడ్డుకున్న ఉద్యోగులు
న్యాయం చేసిన తర్వాతే బాడీలు మార్చురీకి తరలించాలంటున్న కార్మికులు
చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
9కి చేరిన మృతుల సంఖ్య
- విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ప్రమాదంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి
ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్న వైఎస్ జగన్
ఈ దారుణ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్
భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్న వైఎస్ జగన్
బాధితులకు విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు అండగా ఉండాలని సూచన
క్షతగాత్రుల్లో ఆరుగురి గుర్తింపు
- రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు,
- సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజుగా గుర్తింపు
- వివరాలు ప్రకటించిన అధికారులు
మెటల్ లిక్విడ్ ల్యాడర్ పేలడంతో ప్రమాదం
- స్టీల్ ప్లాంట్‌లో మెటల్ లిక్విడ్ ల్యాడర్ పేలడంతో ప్రమాదం
- 1500 డిగ్రీల వేడితో వెళ‍్తున్న స్టీల్ మెట్ లిక్విడ్ ల్యాడ్ వల్ల ప్రమాదం
కొనసాగుతున్న సహాయక చర్యలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- మృతదేహాలను వెలికి తీస్తున్న సిబ్బంది
- గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న సిబ్బంది
ప్లాంట్‌లో మంటలను అదుపుచేస్తున్న సిబ్బంది
- కార్మికులపై స్టీల్ లిక్విడ్ పడడంతో తీవ్రగాయాలైనట్లు గుర్తింపు
- ఎస్‌ఎంఎస్-2లో ఇంకా ఎగిసిపడుతున్న మంటలు
- ప్లాంట్‌లో మంటలను అదుపుచేస్తున్న సిబ్బంది
నలుగురి మృతదేహాల గుర్తింపు
- 9 మంది మృతి చెందినట్లు వార్తలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- నలుగురి మృతదేహాల గుర్తింపు
ల్యాడిల్ నుంచి కుప్పకూలిన హాట్‌మెంట్ బకెట్లు
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.
- విశాఖ స్టీల్ ప్లాంట్లో sms -2 డిపార్ట్మెంట్లో ప్రమాదం.
- ల్యాడిల్ నుంచి కుప్పకూలిన హాట్‌మెంట్ బకెట్లు.
- పెద్దమొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులకు గాయాలు.
- ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం..
- మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది


