ఈ చిత్రం చూశారా... తలపై పుస్తకాలు, చేతిలో క్యారేజీ పట్టుకుని వెళ్తున్నది పార్వతీపురం మండలం గోచక్క ప్రాథమిక పాటశాల విద్యార్థిని. ఈ ఏడాది విద్యామిత్ర కిట్టు అందజేయకపోవడంతో బడికి పుస్తకాలు తీసుకెళ్లేందుకు బ్యాగు కరువైంది. తలపై పుస్తకాలు పడిపోకుండా ఓ చేత్తో అదిమిపట్టుకుని చిన్నారి వేస్తున్న అడుగులు కూటమి పాలకుల హామీలను వెక్కిరిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే విద్యారంగాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అక్షరాలతో పేదకుటుంబాల చిన్నారుల భవితను మార్చేందుకు కృషిచేయాల్సిన సర్కారు.. పుస్తకాల బరువును పిల్లలకు శిక్షలా మార్చడం పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
– పార్వతీపురం రూరల్


