జంట హత్య శిక్ష ఖరారు వాయిదా
కఠారి దంపతుల హత్య కేసు తీర్పు 30కి
కోర్టులో ఐదుగురు దోషుల వాంగ్మూలం నమోదు
దోషుల మానసిక, సామాజిక, పరివర్తనపై నివేదిక కోరిన జడ్జి
నివేదిక వచ్చిన తర్వాత తీర్పు ఇస్తామన్న న్యాయస్థానం
చిత్తూరు అర్బన్: పబ్లిక్ కోర్టు నిండా ఇసుకేస్తే రాలనంత జనం. న్యాయమూర్తి తీర్పు ఏం చెబుతారని సర్వ త్రా ఉత్కంఠ. ఆపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటన. చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో శిక్ష ఖరారు వాయిదా పడింది. దోషులను ఈ నెల 30న న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాలని.. అప్పటి వరకు వీళ్లను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల ని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. 2015 నవంబర్ 17న జరిగిన కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్య కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజు నాథ, వెంకటేష్‌పై నేరం రజువైనట్లు, తీర్పును 27న వెల్లడిస్తామని గత శుక్రవారం చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ఐదుగురు దోషులను చిత్తూరులోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
ఐయామ్ నాట్ కమిటెడ్
శిక్ష ఖరారు చేసే ముందు దోషులను కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని న్యాయమూర్తి డా. ఎన్.శ్రీనివాసరావు అన్నారు. ఆపై వరుసగా కొన్ని ప్రశ్నలు అడి గారు. నేరం ఎందుకు చేశారు..? బాధితులకు క్షమాపణ చెప్పదలచారా..? మీ కుటుంబ పరిస్థితి ఏంటి..? శిక్ష విధిస్తే మీ కుటుంబంలో ఎవరిపై ప్రభావం చూపిస్తుంది..? నేరం చేసినందుకు పశ్చాతాపం పడుతున్నారా..? అనే పలు ప్రశ్నలు అడిగారు. వీటికి చింటూ చాలా వరకు ఇంగ్లిషులోనే సమాధానాలిచ్చారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, అయితే తాను ఎలాంటి నేరం చేయలేదని (ఐయామ్ నాట్ కమిటెడ్), మెరై న్ డిప్లొమో చేసిన తాను బాంబేలోని ఇండియన్ నా వెల్ షిప్ (ఐఎన్‌ఏ)లో పనిచేశానని, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా నేరం తనపై మోపారని చింటూ పేర్కొన్నాడు.
సీకే బాబుపై జరిగిన హత్యాయత్నాల్లో కూడా ప్రధాన నిందితుడు కఠారి మోహన్ అని, అతని మేనల్లుడు అయినందుకు తనపై కేసు పెట్టారని, చిత్తూరు కోర్టులో గతంలో జరిగిన బాంబు పేలుడు కేసులో మీడియా తనను దోషిగా చూపించే ప్రయత్నం చేసిందని, తీరా ఇది ఉగ్రవాదు లు చేసినట్లు ఎన్‌ఐఏ తేలి్చందన్నారు. తనకు మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లి ఉందని, జైల్లో ఉన్న న్ని రోజులు స్రత్పవర్తనతో నడుచుకున్నట్లు చింటూ చెప్పాడు. కఠారి దంపతుల హత్య జరిగిన విష యం తనకు తెలిసినవెంటనే చట్టంపై ఉన్న గౌరవంతో కోర్టు లో వచ్చి లొంగిపోయానన్నాడు. మారడానికి అవకాశం ఇస్తే తన ఉద్యోగం, వ్యాపారం చేసుకుని బతుకుతానని చింటూ చెప్పాడు. చింటూతో పాటు మిగిలిన నలు గురి వాంగ్మూలాన్ని సైతం న్యాయమూర్తి పేపర్‌పై రాసుకుని, దోషుల సంతకాలు తీసుకున్నా రు. శిక్ష ఖరారుకు ముందు తమ వాదన వినిపించడానికి అనుమతివ్వాలని డిఫెన్స్ న్యాయవాదులు కోరారు.
నివేదిక కోసం ఆదేశం
కాగా దోషులు ఐదుగురు మానసిక ప్రవర్తనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ ఆధ్వర్యంలో మానసిక వైద్యనిపుణులు పరిశీలించాలన్నారు. అలాగే వీళ్ల సామాజిక పరిస్థితి, జైల్లో ఉన్నన్ని రోజులు సత్ప్రవర్తనపై జిల్లా ప్రొబేషన్ అధికారి, జిల్లా జైళ్ల అధికారి నివేదిక ఇవ్వాలన్నారు. తరుపది ఈనెల 30వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని.. అప్పటి వరకు వీళ్లను జ్యుడీíÙయల్ కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం దోషులను భారీ బందోబస్తు నడుమ పోలీసులు చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.


