శ్రీకాకుళం: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ 

Jobs Recruitment In Srikakulam District Medical Health Department - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.చంద్రానాయక్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్‌ స్పె షలిస్ట్, జనరల్‌ ఫిజీషియన్, ఎన్‌పిసీడీఎస్‌ కింద కార్డియాలజిస్ట్, ఎన్‌పీసీడీఎస్‌ కింద మెడికల్‌ ఆఫీ సర్, ఎన్‌బీఎస్‌యూసీ కింద మెడికల్‌ ఆఫీసర్, స్టాఫ్‌నర్సులు, సైకియాట్రిస్ట్‌ నర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫిజియోథెరఫిస్ట్‌లు, ఆడియో మెట్రిషియన్, సోషల్‌ వర్కర్లు, క్వాలిటీ మానిటర్‌ కన్సల్టెంట్, హాస్పిటల్‌ అటెండెంట్, శాని టరీ అటెండెంట్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీకాకుళం.ఏపీ.జీవోవి.ఇన్‌ నుంచి సమాచారం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్‌ అధికారి.. అసలు నిజం ఇదే!   
ఇంటర్‌లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్‌ అవకాశాలు మీకోసమే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top