కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్‌ అధికారి.. అసలు నిజం ఇదే!

IAS Officer Selling Vegetables at Roadside, Here The Story Behind It - Sakshi

లక్నో: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని ఐఏఎస్‌ అధికారి అఖిలేష్‌ మిశ్రా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో స్పెష‌ల్ సెక్రటరీగా ప‌నిచేస్తున్నాడు. అయితే ఈయన ఇటీవల రోడ్డు పక్కన కూర‌గాయ‌లు అమ్ముతూ ఉన్న ఒక ఫోటోను త‌న ఫేస్‌బుక్‌లో షేర్ చేయ‌డంతో అప్పటి నుంచి ఈ ఫోటో నెట్టింట్టా హల్‌చల్‌ చేసింది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఒక ఉన్నత అధికారి అయి ఉండి ఇలా సామాన్యుడిలా రోడ్డుపై కూరగాయలమ్మడాన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది !

అయితే తాజాగా ఈ ఫోటోపై సదరు ఐఏఎస్‌ అధికారి అఖిలేష్‌ మిశ్రా స్పందించారు.. కూరగాయలు దుకాణం వద్ద కూర్చున్న ఫోటో నిజమే.. కానీ తాను కూరగాయలు అమ్మలేదని, కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లానని స్పష్టం చేశారు. ‘నేను వృత్యిరీత్యా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన‌ప్పుడు, అక్కడ మార్కెట్‌లో ఆగి కూర‌గాయ‌లు కొన్నాను. 

అయితే కూర‌గాయ‌లు అమ్మే ఓ ముసలామే కాసేపు ఆమె కూర‌గాయ‌ల షాప్‌ వద్ద కూర్చోవాల‌ని అడిగింది. దీంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆమె  అడిగినదానికి కాద‌న‌లేకపోయా. అక్కడే కాసేపు కూర్చున్నాను. ఈ లోగా కొందరు అక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫోన్‌ ద్వారా ఫేస్‌బుక్‌లో పెట్టారు. నేను కూడా ఆ ఫోటోను ఈ రోజే చూశాను’ అని అఖిలేశ్‌ మిశ్రా వివరించారు.
చదవండి: పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top