సైబర్‌ నేరగాళ్ల వలలో జనసేన ఎమ్మెల్యే | Janasena MLA Loses Rs 12 Lakh In Fake RTA Challan Cyber Fraud In Eluru, More Details Inside | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల వలలో జనసేన ఎమ్మెల్యే

Mar 23 2026 1:44 PM | Updated on Mar 23 2026 1:53 PM

Janasena MLA loses Rs 12 lakh in fake RTA challan cyber fraud

ఆర్టీఏ చలానా పేరిట వచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 

ఆ వెంటనే ఆయన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయం  

బుట్టాయగూడెం: ఏలూరు జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే సైబర్‌ నేరస్తుల బారిన పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాల­రాజు మొబైల్‌ ఫోన్‌కు ఆర్టీఏ చలానా పేరిట ఒక లింక్‌తో కూడిన మెసేజ్‌ వచ్చింది. దాన్ని ఓపెన్‌ చేయగానే ఆయన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.12 లక్షలు డ్రా చేసినట్టు మెసేజ్‌లు రావడంతో షాక్‌­కు గురయ్యారు. 

వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యా దు చేశారు. జీలుగుమిల్లి ఎస్‌ఐ కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేస్తున్నట్టు తెలిపా రు. ప్రభుత్వ, అధికారిక సంస్థల పేరిట వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని, సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement