Jagananna Vidya Kanuka, Kit: ‘జగనన్న విద్యా కానుక’లో ఏమున్నాయంటే | School Bag, Shoes, Uniform - Sakshi Telugu
Sakshi News home page

‘జగనన్న విద్యా కానుక’లో ఏమున్నాయంటే...

Oct 8 2020 1:22 PM | Updated on Oct 8 2020 4:20 PM

Jagananna Vidya Kanuka: Free Kit for Students - Sakshi

‘జగనన్న విద్యా కానుక’ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

సాక్షి, విజయవాడ: తల్లిదండ్రులు, విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ ‘జగనన్న విద్యా కానుక’ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందజేసే ఈ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక కిట్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో ఇతర వస్తువులను పొందుపరిచారు. (చదవండి: ‘విద్యా కానుక’.. తల్లిదండ్రుల వేడుక)

ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు(క్లాత్‌), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. కోవిడ్‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేశారు. యూనిఫామ్‌ కుట్టించుకునేందుకు మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తున్నారు. అంతేకాదు ‘జగనన్న విద్యాకానుక’ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. (మరో ప్రతిష్టాత్మక పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం)



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement