అతి చిన్న రాతిపై 'క్షీరసాగర మథనం'

International Book of Records for Harshitha - Sakshi

ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో హర్షిత

తెనాలి: పేదింట జన్మించి, సంక్షేమ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుకుంటున్న హర్షిత..చిత్రలేఖనంలో తన సృజనతో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా అంగలకుదురులోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతిగృహంలో ఉంటూ తెనాలిలో జేఎంజే మహిళా కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతున్న హర్షిత దావులూరి 4.6 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన అతి చిన్న రాతిపై పురాణాల్లోని అతి పెద్ద వృత్తాంతమైన క్షీరసాగర మథనాన్ని 15 నిమిషాల్లో చిత్రీకరించింది.

ఆ వీడియోను కళాశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ షైనీ తదితరులు ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపారు. దీంతో రికార్డ్‌ హోల్డర్‌గా గుర్తిస్తూ ‘సెల్యూట్‌ ది టాలెంట్‌’ అంటూ ఆ సంస్థ రికార్డు పతకాన్ని, సర్టిఫికెట్‌ను హర్షితకు ఇటీవల పంపింది. హర్షిత సొంతూరు క్రాప. తల్లిదండ్రులు హేమలత, నాగయ్య వ్యవసాయ కూలీలు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనేది తన లక్ష్యమని హర్షిత తెలిపింది. 

రికార్డు పతకం, ధృవీకరణ పత్రాలతో హర్షిత దావులూరి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top