వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Intensity Of The Sun Is Likely To Be High This Summer - Sakshi

సాక్షి, అమరావతి: ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అ­వకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినందున.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధి­కారులను వి­ప­త్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికా­రులతో సంస్థ ఎండీ అంబేడ్కర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

2020వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో వడగా­డ్పుల మరణాలు లేవని.. ఈ ఏడాది కూడా అదే విధంగా చర్యలు తీసుకో­వాలని, జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయా­లని సూ­చిం­చారు. వడగా­డ్పుల తీ­వ్రత ఆధారంగా పా­ఠ­శాలల సమ­యా­­­­లను మార్చాల­ని ఆదేశించారు. అ­ధిక ఉష్ణోగ్రతలు, వడగా­డ్పులను ఎప్పటికప్పుడు పర్య­వేక్షించే విభా­గాన్ని స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్‌..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top