పోలింగ్‌ తగ్గినా వైఎస్సార్‌సీపీకి పెరిగిన ఓట్లు

Increased votes for YSRCP despite lower polling - Sakshi

2019 ఎన్నికల కన్నా 15 శాతానికిపైగా తగ్గిన పోలింగ్‌

2021లో వైఎస్సార్‌సీపీకి పెరిగిన 1.64 శాతం ఓట్లు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2019లో జరిగిన ఎన్నికల్లో కన్నా ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతం తగ్గినా వైఎస్సార్‌సీపీకి లభించిన మెజారిటీ భారీగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 79.76 శాతం పోలింగ్‌ నమోదైంది. వైఎస్సార్‌సీపీకి 2,28,376 ఓట్ల మెజారిటీ లభించింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 64.42 శాతం పోలింగ్‌ నమోదైంది.

కోవిడ్‌ నేపథ్యంలో 15 శాతానికిపైగా పోలింగ్‌ తగ్గింది. అయినా వైఎస్సార్‌సీపీకి పోలైన ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలకంటే వైఎస్సార్‌సీపీకి 1.64 శాతం మేర ఓట్లు పెరిగాయి. తాజా ఎన్నికల్లో 2,71,592 ఓట్ల మెజారిటీ లభించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top