పెరిగిన చలి తీవ్రత
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
భీమవరం (ప్రకాశం చౌక్)/బుట్టాయగూడెం: వారం రోజులు గా చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే వాతావరణం చల్లబడి చలి మొదలవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి పెరుగుతున్న క్రమంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ము ఖ్యంగా గుండె సమస్యలు, డయాబెటిస్, ఆస్తమా, పొగతాగే వారు, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చలికాలంలో ముఖ్యంగా శ్వాసనాళాలు ముడుచుకుపోయే అవకాశం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
⇒ చర్మం పొడి బారకుండా మాయిశ్చరైజర్లు వినియోగించాలి.
⇒ తగిన మోతాదులో నీరు కచ్చితంగా తాగాలి.
⇒ శీతల పానియాలు, ఐస్‌క్రీమ్‌లు, కూలింగ్ వా టర్‌కు దూరంగా ఉండాలి.
⇒ దుమ్ము, ధూళి ఉండే ప్రాంతాలకు దూరంగా, చలిగాలుల్లో తిరగడం మానేయాలి.
⇒ ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్ ఏడాదికి ఒకసారి, న్యూమోనియా వ్యాక్సిన్ ఐదేళ్లకు ఒకసారి వై ద్యుల సూచనలతో వేయించుకోవాలి.
⇒ ఇండోర్ వ్యాయామం, జిమ్ ప్లాన్ చేసుకోవాలి.
⇒ బయటకు వెళ్లే సమయంలో తగినంత వేడిని శరీరానికి అందించే ఉన్ని దుస్తులు ధరించాలి.
⇒ ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు వస్తే వైద్యుల సూచనలతో మందులు వాడాలి.
⇒ సొంత వైద్యం సరికాదు. కుటుంబంలో ఒకరికి వాడే ఔషధాలు వేరొకరికి వినియోగించరాదు.
⇒ శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఏజెన్సీలో చలి పంజా
పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది రోజులుగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా యి. రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. మా రుమూల కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉదయం 8 గంటలు దాటితే కానీ ప్రజలు బయటకు రాలేని, సాయంత్రం 6 గంటలకే ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి. బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావంతో చాలామంది జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. డిసెంబర్, జనవరిలో చలి మరింత పెరిగే అవ కాశం ఉంది. మంచులో ప్రయాణాలు ప్రమాదకరమని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో గిరిజన మండలాల్లో వేకువజామున మంచులో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి.
శరీరాన్ని రక్షించుకోవాలి
శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవాలి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సీ కలిగిన పదార్థాలు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. శ్వాసకోశ సమస్యతో ఇబ్బందులు వస్తే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వైద్యం అవసరమైతే వైద్య సేవలను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పిల్లలను, వృద్ధులు చలిలో తిరగకుండా చూసుకోవాలి. – గీతాబాయ్, డీఎంహెచ్‌ఓ, భీమవరం


