భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త | Incident in Palnadu District | Sakshi
Sakshi News home page

భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

Jun 12 2026 5:05 AM | Updated on Jun 12 2026 5:05 AM

Incident in Palnadu District

పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం

వినుకొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై పెట్రోల్‌ పోసి ఓ భర్త  నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన కొండి ఆంజనేయులు చెడు వ్యసనాలకు బానిసై తరచూ భార్య సుబ్బులును వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆంజనేయులు గురువారం ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో సుబ్బులు గట్టిగా కేకలు వేసింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బులును వినుకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement