వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్‌ విధానం అమలు | Implementation of ranking policy for schools from next year in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్‌ విధానం అమలు

Nov 6 2021 4:06 AM | Updated on Nov 6 2021 4:06 AM

Implementation of ranking policy for schools from next year in Andhra Pradesh - Sakshi

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరి బి.రాజశేఖర్, ఉన్నతాధికారులు

తెనాలి టౌన్‌: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ర్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరి బి.రాజశేఖర్‌ తెలిపారు. తెనాలి మండలం కొలకలూరులోని జెడ్పీ హైస్కూల్‌ను పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరి బిరాజశేఖర్, కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో చేపట్టిన నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించింది. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పడమే ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు.

సిలబస్‌ పూర్తి చేయడం ముఖ్యం కాదని, విద్యార్థులకు చదవడం, రాయడం, అర్థమయ్యేలా బోధించడం ముఖ్యమన్నారు.  జనవరి 5వ తేదీన తిరిగి పాఠశాలకు వస్తామని, అప్పటికల్లా విద్యార్థులంతా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో రాసి, చదవగలిగేలా చూడాలన్నారు. వీరి వెంట స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అడ్వయిజర్‌ మురళి, సమగ్ర శిక్షా ఎస్‌పీడీ కె.సెల్వి, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, సమగ్ర శిక్షా ఏపీసీ ఎం.వెంకటప్పయ్య, డీవైఈవె కె.నారాయణరావు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement