
శ్రీ సత్యసాయి జిల్లా: ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆదివారం గద్వాల డీఎస్పీ మొగు లయ్య, గట్టు ఎస్‌ఐ మల్లేశ్ చిన్నోనిపల్లె, దీనికి సమీపంలోని మిట్టదొడ్డి గ్రామాల్లో విచారణ చేపట్టారు. ప్రియాంక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థి తులు, చుట్టుపక్కల వారితో ఆమె ఏ విధంగా ఉండేదనే వివరాలను డీఎస్పీ అడిగి తెలుసు కున్నారు.
ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసు కోవాలన్న ఉద్దేశంతో కొత్తగూడెం జిల్లా పా ల్వంచ నుంచి గద్వాల జిల్లా చిన్నోనిపల్లె గ్రా మానికి చేరుకున్న ప్రియాంక.. దాదాపు రెండు నెలలపాటు ప్రియుడి ఇంటి వద్ద పోరాటం చేసినా.. చివరికి ఆ ప్రేమకథ విషాదాంతంగా మారిన విషయం తెలిసిందే. చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌ను పెళ్లి చేసుకోవడానికి పోరాటం సాగించిన ప్రియాంక, తన ప్రయత్నం విఫలం కావడంతో శుక్రవారం విషపు గుళికలను కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగగా.. గద్వాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం అదే రాత్రి ప్రియాంక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ స్వగ్రామమైన కొత్తగూడెం జిల్లా పాల్వంచకు తరలించారు.