ఇదే సీఎం జగన్‌ లక్ష్యం: అమర్‌నాథ్‌

Gudiwada Amarnath Talks In Press Meet Over Decentralization In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: పాలనా వికేంద్రికరణ  బిల్లుపై గవర్నర్‌ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లు అమోదాన్ని అందరం స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు. ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నది సీఎం జగన్‌ లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్‌ ముందు చూపు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. (చదవండి: వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం)

విశాఖపట్నంలో అన్ని రకాల వనరులున్నాయని, ఉన్నతమైన రాజధానిగా విశాఖ అవతరించ బోతుందన్నారు. దురాలోచనలతో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగులుతున్నారని, రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఆయన కోల్పోయారని విమర్శించారు. రియల్‌ ఎస్టేట్‌ కోసం చంద్రబాబు ఆలోచన చేస్తే.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top