సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌కు ఘన స్వాగతం | A grand welcome to CJI Justice Suryakant | Sakshi
Sakshi News home page

సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌కు ఘన స్వాగతం

Mar 1 2026 5:08 AM | Updated on Mar 1 2026 5:08 AM

A grand welcome to CJI Justice Suryakant

తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 

స్వాగతం పలికిన హైకోర్టు సీజే జస్టిస్‌ ఠాకూర్, న్యాయమూర్తులు  

రేణిగుంట/తిరుమల: రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ సూర్యకాంత్‌కు ఘన స్వాగతం లభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, చిత్తూరు జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దొనడి రమేష్, జస్టిస్‌ మహేశ్వరరావు కుంచేం, జస్టిస్‌ టి.సి.డి. శేఖర్, డీఐజీ షీముషిభాజ్‌పాయ్, చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి అరుణ సారిక, అడిషనల్‌ జిల్లా జడ్జి గురునాథం, తిరుపతి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సాదరంగా స్వాగతం పలికారు. 

కాగా,  సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి తదితరులు ఘన స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement