కడప, వైజాగ్‌లలో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

Government Jobs In Visakhapatnam, Kadapa: Anganwadi, Data Entry, Computer Operator - Sakshi

కడప జిల్లా అంగన్‌వాడీల్లో 288 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 288

► పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ కార్యకర్తలు–50, అంగన్‌వాడీ సహాయకురాలు–225, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు–13.

► అర్హత:  అంగన్‌ వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి, అంగన్‌వాడీ సహాయకురాలు, మినీ అంగన్‌ వాడీ కార్యకర్త పోస్టులకు ఏడో ఉత్తీర్ణత ఉండాలి. స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. 

వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత ప్రమాణాలు, ఓరల్‌ ఇంట ర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్త్రీశిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

► వెబ్‌సైట్‌: kadapa.ap.gov.in


డబ్ల్యూడీసీడబ్ల్యూ, విశాఖపట్నంలో 12 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 12

పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌–07, కంప్యూటర్‌ ఆపరేటర్‌–05.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: పని చేయాల్సిన ప్రాంతాలు: కొయ్యూరు, ముంచంగిపుట్, పాడేరు, పెదబయలు,డుంబ్రీగూడ,అనకాపల్లి, రావికమతం.

కంప్యూటర్‌ ఆపరేటర్‌: పని చేయాల్సిన ప్రాంతాలు: భీమునిపట్నం, నర్సీపట్నం,పెందుర్తి, నక్కపల్లి, ఎలమంచిలి.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.15,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021

► వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top