
తూర్పుగోదావరి జిల్లా: వర్షాల తీవ్రత కారణంగా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. 10.9 అడుగులకు వరద నీటిమట్టం చేరుకుంది. దాంతో ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేశారు.

డెల్టా కాలువలకు 9,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వర్షాలతో ఎగు ప్రాంతంలో కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పాండ్ లెవెల్ 13.99 మీటర్లుగా ఉంది.
