‘సీఎం జగన్‌ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారు’

Gandhi And Lal Bahadur Shastri Birthday Celebrations At YSRCP Party Office - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. వైస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ(అక్టోబర్‌ 2) మహత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రీల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగాం సురేష్‌, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గాంధీ ఆశయ సాధన కోసం అందరం పునరంకితం కావాలన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. గాంధీజీని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. గ్రామ స్వరాజ్యం ఆచరణలో చూపిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్‌)

ఇక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశ్వం ఉన్నంత వరకు తలుచుకోవాల్సిన మహ మనిషి గాంధీజీ అని చెప్పారు. ఆయనను స్మరించుకోవడమే కాకుండా గాంధీ ఆశయాలను నిజం చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజల ముంగిటకే తీసుకేళ్లిందని, సచివాలయ వ్యవస్థ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా అయిందని తెలిపారు. ప్రతి ఇంటికి వాలంటిర్లు వెళ్లి పెన్షన్‌లుఇవ్వడమే ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం వదిలిపోయిన భయంకరమైన ఆర్థిక పరిస్థితిలో కూడా సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గాంధీజీ కలలు కన్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టుల ద్వారా ప్రతిపక్షం అడ్డుపడుతోందని వచ్చే మూడేళ్లలో సమస్యలు లేని గ్రామాలు ఉండేలా చేస్తామన్నారు. పట్టణాలకు ధీటుగా గ్రమాలను తయారు చేస్తామని సజ్జల వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top