సంక్షేమం తలుపు తడుతోంది

Gadapa Gadapaku Mana Prabhutvam in Chittoor District - Sakshi

(చిత్తూరు) నగరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సరీ్వసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.  మంగళవారం నగరి మండలం, దేశూరు అగరం గ్రామంలో ఆమె గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి మూడేళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును అంకెలతో సహా వివరించారు.

నవరత్న పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు ఏయే సంక్షేమ పథకాలు అందాయి, వాటి ద్వారా ఎంత మేర లబ్ధి చేకూరిందో వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్‌లెట్‌లను అందజేశారు. సమస్యల కారణంగా పథకాల లబ్ధి ఆగిందని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఎందుకు ఆగిందో సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా తెలుసుకున్నారు. వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ అర్హులెవ్వరికీ అన్యా యం జరగకూడదని సచివాలయ సిబ్బందికి సూచించారు. 

మంచి చేస్తుంటే ఓర్వలేక కుట్రలు  
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేక కుట్ర రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే 95 శాతానికిపైగా ముఖ్యమంత్రి జగనన్న అమలు చేశారని గుర్తు చేశారు. ఏ పథకమైనా ప్రకటించిన తేదీల్లోనే లబి్ధదారులకు అంద జేస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీపీ భార్గవి, వైస్‌ ఎంపీపీలు కన్నియప్పన్, ఢిల్లీ, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, హౌసింగ్‌ డీఈ శంకరప్ప, వెటర్నరీ ఏడీ వాసు, ఎంపీటీసీ సభ్యు లు గుణశేఖర్‌ రెడ్డి, నాయకులు సుధాకర్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పరంధామరెడ్డి, శరత్‌ బాబు, దినకర్‌రెడ్డి, రామూర్తి రెడ్డి, రంగనాథం,  మధు,  సచి వాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top