విశాఖ బీచ్‌ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం | Massive Fire Accident In Vizag Dino Park At RK Beach, More Details Inside | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్‌ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

Aug 13 2024 12:13 PM | Updated on Aug 13 2024 12:22 PM

Fire Accident In Vizag Dino Park

సాక్షి,విశాఖ : విశాఖ బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న డైనో పార్క్‌ రెస్టోకేఫ్‌లో మంటలు చెలరేగాయి. మంటల దాటికి రెస్టారెంట్‌ కాలిబూడిదైంది. దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి  స్థలాన్ని లీజ్‌కు తీసుకొని డైనో పార్క్ రెస్టోకేఫ్‌ను నిర్వాహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement