
తిరుమల: తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శేషచల అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం మంటలు వ్యాపించాయి.
ఎండలతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.