'అమర్‌నాథ్‌ అన్నయ్య చూపిన చొరవ మరువలేనిది'

Dronamraju Srivastava Thanked Gudivada Amarnath - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కష్ట కాలంలో నెల రోజుల పాటు తమ కుటుంబానికి ఆత్మీయ బంధువుగా అన్నీ తానై అండగా నిలిచిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌కు దివంగత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ కుమారుడు శ్రీవాత్సవ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నాన్నను బాబాయ్‌ అంటూ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగే అమర్‌నాథ్‌ అన్నయ్య చూపించిన చొరవ మరువలేనిదన్నారు.  (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే')

తమ తండ్రిని పినాకిల్‌ ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి నెల రోజుల పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ.. బాగోగులు చూసుకున్నారన్నారు. తమ తండ్రి మరణించినప్పటి నుంచి అంతిమ యాత్ర చివర వరకూ తమతోనే ఉండి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారని గుర్తు చేశారు. తమ కుటుంబంలో సభ్యుడిగా, అన్నగా అమర్‌నాథ్‌ చూపించిన ప్రేమ, ఆప్యాయతలు మరిచిపోమని, ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. నాన్న లేని తనకు అమర్‌నాథ్‌ అన్న అశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు.  (బాగున్నావా కేకే.. సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top